
బైక్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు (వీడియో)
ప్రైవేట్ బస్సుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీ నుంచి బిహార్‌కు వెళ్తోన్న ప్రైవేట్ బస్సు ఖుషీనగర్ టోల్ ప్లాజా వద్ద బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తోన్న బైక్‌ను ఢీకొట్టగా.. బస్సు ట్రైర్ల కింద ఇద్దరు నలిగి నుజ్జునుజ్జు అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సును సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.




