టీమ్
ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తన భార్యతో కలిసి గురువారం భాగ్యనగరానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి పెడల్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడటంతో పోలీసులు వారిని నిలువరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వారు తిరిగి వెళ్లే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.