
VIDEO: ప్యారడైజ్ ఈవెంట్లో డ్యాన్స్‌తో అదరగొట్టిన రాఘవ్ జుయల్
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ నటుడు, డ్యాన్స్ కళాకారుడు రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ‘ది ప్యారడైజ్’లో ప్రతినాయకుడిగా నటిస్తున్న రాఘవ్, తనదైన శైలిలో స్లో మోషన్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. 'ఆయా షేర్', 'ఏషనాగుల కట్ట మీద' పాటలకు అతను చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




