
రాజమౌళి మాటలకు భావోద్వేగంతో యాంకర్ సుమ కన్నీళ్లు
టాలీవుడ్లో యాంకర్ సుమ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా వేదికపై ఆమెకు ఊహించని సర్ ప్రైజ్ ఎదురైంది. దర్శకధీరుడు రాజమౌళి తన గురించి చెప్పిన మాటలు విని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భర్త రాజీవ్ కనకాల, తల్లి, పిల్లలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




