రైళ్లలో మధుమేహులకు ప్రత్యేక ఆహారం

19901చూసినవారు
రైళ్లలో మధుమేహులకు ప్రత్యేక ఆహారం
దేశంలో పెరుగుతున్న మధుమేహ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, ప్రయాణికులు తమకు డయాబెటిక్ ఆహారం అవసరమని ముందుగానే సూచించవచ్చు. ఈ సౌకర్యం తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు వెల్లడించింది. అన్ని ప్రీపెయిడ్ రైళ్లు ఇప్పుడు శాఖాహారం, మాంసాహారం, జైన్ భోజనం, డయాబెటిక్ శాఖాహారం, డయాబెటిక్ మాంసాహారం అనే ఐదు రకాల ఆహార ఎంపికలను అందిస్తాయి.

సంబంధిత పోస్ట్