బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యామ్ నిర్మిస్తుండగా, భారత్ కూడా దిగువన దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చైనా మెడాగ్ హైడ్రోపవర్ స్టేషన్ 60వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా, భారత్ చేపట్టిన దిబాంగ్ ప్రాజెక్టు 278 మీటర్ల ఎత్తుతో దేశంలోనే అతిపెద్ద కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్‌గా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరద నియంత్రణ, విద్యుదుత్పత్తి, చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడం వంటి ప్రయోజనాలున్నాయని భావిస్తున్నారు.