రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం పోరాడారా?: హరీశ్‌రావు

23చూసినవారు
రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం పోరాడారా?: హరీశ్‌రావు
TG: రాష్ట్రం కోసం తాము మంత్రి పదవులు త్యాగం చేశామని.. రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా తెలంగాణ కోసం పోరాడారా? అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని మెదక్‌ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. మెదక్‌ నుంచి సిద్దిపేటకు ఆఫీసులను నేను తరలించానని అంటున్నారు. నేను తరలించిన ఆఫీస్‌ పేరు చెబితే నేనే తెచ్చిస్తా. రేవంత్‌రెడ్డి భాష జారితే మేము కూడా జారాల్సి వస్తుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్