మన దేశంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగాలు రెండు ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని బర్సూర్‌లో ఉన్న బత్తీస్ మందిరంలోని శివలింగం పూర్తిగా 360 డిగ్రీలు తిరిగే ప్రత్యేకత కలిగి ఉంది. ఈ ఆలయంలో 32 స్తంభాలు, రెండు గర్భగుడులు ఉండటం విశేషం. అలాగే మధ్యప్రదేశ్‌లోని రామేశ్వర ఆలయంలో కూడా ఇలాంటి శివలింగం ఉంది. ఈ శివలింగాలని దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో ఇక్కడ భారీగా భక్తులు తరలివస్తారు. ఈ శివలింగాన్ని భక్తి భావంతో తిప్పితే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.