ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో టీమ్‌ఇండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 211/6 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 192/6 పరుగులకే పరిమితమైంది. విజయం అనంతరం భారత ఆటగాళ్లు జాతీయ జెండా పట్టుకుని స్టేడియంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
Video Credit: Sony Sports Network