డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు.. 13 మంది స్కామర్లు అరెస్ట్

11251చూసినవారు
డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు.. 13 మంది స్కామర్లు అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లాలో డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు అయింది. భీమవరం పోలీసులు 13 మంది స్కామర్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 42 లక్షల నగదు రికవరీ చేయగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 19,35,231 నగదును ఫ్రీజ్ చేశారు. నిందితుల వద్ద నుంచి 15 మొబైల్స్, అంతర్జాతీయ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.