డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి డబ్బు కాజేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించాలని, పోలీసుల పట్ల భయం కాకుండా గౌరవం ఉండాలని రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె అన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసులమని నమ్మించి మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలపై అవగాహనతో పాటు, పోలీసులు నూతన సాంకేతికతపై పట్టు సాధించాలని పేర్కొన్నారు.