
దారుణం.. అత్త గొంతు కోసిన అల్లుడు
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలో అత్త రమణమ్మపై అల్లుడు నారాయణ కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన రమణమ్మను ఆసుపత్రికి తరలించగా, అక్కడ అల్లుడిపై అత్త బంధువులు ఎదురు దాడి చేశారు. గతంలో కుటుంబ కలహాల నేపథ్యంలో రమణమ్మ కూతురు ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అత్తా, అల్లుళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. కాగా, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




