
ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న ఆసీస్ స్టార్ ప్లేయర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడి కోలుకున్నారు. గతేడాది డిసెంబర్ చివరిలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతడిని 8 రోజులపాటు కోమాలో ఉంచారు. కోమా నుంచి బయటకు వచ్చాక మాట్లాడటానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. వైద్యుల సహాయంతో ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.




