
పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ.. నెలరోజుల నుంచే స్కెచ్!
TG: కరీంనగర్లో ఈ నెల 3న జరిగిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. దొంగల ముఠా నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించి ఈ నేరానికి పాల్పడినట్లు తాజా సమాచారం. ముఠా సభ్యులు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బోగస్ ఆధార్ కార్డులతో రూములు బుక్ చేసుకుని, అక్కడి నుంచే రెక్కీ నిర్వహించారు. అనంతరం ధర్మపురిలోని విజయలక్ష్మి వసతి గృహంలో గదులు అద్దెకు తీసుకున్నారు. ఈ దోపిడీలో ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరొకరు బయటి నుంచి సహకరించినట్లు అనుమానిస్తున్నారు.




