
అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష (వీడియో)
అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు పనుల పురోగతిని సమీక్షిస్తానని, పెండింగ్లో ఉన్న 2,471 రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అమరావతికి ప్రపంచ స్థాయి రూపాన్ని తీసుకురావడానికి గ్రీనరీ, సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.




