థియేటర్ల పరిస్థితిపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

5చూసినవారు
థియేటర్ల పరిస్థితిపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
థియేటర్ల ప్రస్తుత పరిస్థితిపై నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆ నలుగురు' అనే పాత టాపిక్ ఇప్పుడు అనవసరమని, థియేటర్లు మూతపడుతున్నాయని ఆయన అన్నారు. సింగిల్ స్క్రీన్‌లను కాపాడుకుంటేనే సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతుందని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్‌లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన తెలిపారు. టికెట్, క్యాంటీన్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని, ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్