
అల్లు అర్జున్ - అట్లీ చిత్రం.. ఊహకు అందని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న AA22xA6 మూవీపై అట్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బెంగళూరులో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్లో మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు అందని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుందని, ఇది రిస్క్ కాదని, ఎంతో ఎంజాయ్ చేస్తూ తెరకెక్కిస్తున్నానని తెలిపారు. అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ చివర్లో అబుదాబిలో కొత్త షెడ్యూల్‌తో షూటింగ్ జరుపుకోనుంది.




