‘ఇరుముడి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర నటనపై దర్శకుడు శివ నిర్వాణ ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులోనే ఎంతో గుండె ధైర్యంతో నక్షత్ర నటించిందని కొనియాడారు. ముఖ్యంగా ‘I have no father’ అంటూ ఆమె పండించిన భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. ఎన్ని టేకులు అయినా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. షూటింగ్ సమయంలో నక్షత్రకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసిన ఆమె తల్లికి శివ నిర్వాణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.