హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి

16728చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 157 మంది మృతిచెందగా, 257 మంది గల్లంతయ్యారు. జూన్ 30 నుంచి ఆగస్టు 9 మధ్య వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 68 మంది, రోడ్డు ప్రమాదాల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమై రూ.886 కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు, 259 రహదారులు ధ్వంసమయ్యాయి. తాగునీటి సరఫరా పథకాలు కూడా ప్రభావితమయ్యాయి.

సంబంధిత పోస్ట్