
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన భారతి, మండపేట ఫొటోగ్రాఫర్ శ్రీనివాసరావు ప్రేమించుకుని 2019 జూన్ 11న వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక శ్రీనివాసరావు మద్యం మత్తులో భార్యను వేధించేవాడు. ఈ నెల 12న శ్రీనివాసరావు భారతిని పుట్టింటికి పంపించి, 14న బలవంతంగా మళ్లీ మండపేట తీసుకెళ్లాడు. 17న అర్ధరాత్రి శ్రీనివాస్ తమ్ముడు సురేంద్ర.. భారతి ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో ఉందని ఆమె తల్లికి చెప్పాడు. దీంతో మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




