AP: తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలంలోని మల్లాం బ్రహ్మోత్సవాల్లో అన్నదాన కార్యక్రమం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. వంటకాలు సిద్ధం చేస్తున్న సమయంలో వేడి సాంబారు ఒలికిపోవడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఉత్సవాల్లో కలకలం రేగింది.