TG: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సింగరాయ జాతరకు వెళ్లిన శనిగరం గ్రామానికి చెందిన ఠాగూర్ శివసాయి సింగ్ (15) అనే బాలుడికి కొలనులో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.