పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ పై రేపు కీలక చర్చ జరగబోతుంది. రేపటి నుంచి 2 రోజులపాటు ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఉభయసభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరుకావాలని సూచించాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. లోక్ సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశముంది. కాగా ప్రధాని మోదీ సోమవారం సభకు వచ్చే అవకాశం ఉంది.