
సర్పంచ్ ఎన్నికల్లో కోతుల బెడదే ప్రధాన ఎజెండా
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కోతుల సమస్య గ్రామాల్లో ప్రధాన అజెండాగా మారింది. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను పక్కనపెట్టి, కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తేనే ఓటు వేస్తామని ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు షరతులు విధిస్తున్నారు. దీంతో ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి, సమస్య పరిష్కరిస్తామని హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడం, దాడులు చేయడం, పంట పొలాలను ధ్వంసం చేయడం వంటి వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.




