జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్‌షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడనున్నారు.