మెప్మా అదనపు డైరెక్టర్ యాదగిరిరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

29చూసినవారు
మెప్మా అదనపు డైరెక్టర్ యాదగిరిరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
TG: పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ప్రభుత్వ విభాగం మెప్మా అదనపు డైరెక్టర్ యాదగిరిరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. హైదరాబాద్, సూర్యాపేటలోని యాదగిరిరావుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లను అధికారులు మంగళవారం తనిఖీ జరిపారు. ఈ సోదాల్లో రూ.4.75 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఉప్పల్‌లో రూ.2 కోట్ల విలువైన మూడంతస్తుల భవనంతో పాటు కుమారుడి పెట్టుబడులపై ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్