TG: ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ల అనర్హత పిటిషన్లనూ స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే.