‘X’ (ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం సాయంత్రం యాప్, వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు సేవలను వినియోగించలేకపోతున్నారు. సాంకేతిక అంతరాయాలను గుర్తించే డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ప్లాట్‌ఫార్మ్‌పై వచ్చిన లోపాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. సాయంత్రం 5.08 గంటల వరకు కనీసం 1,500కి పైగా యూజర్లు సమస్యలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది.