
జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి
మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాల గ్రామంలో జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై 8 మంది వ్యక్తులు ఫ్యాన్స్ పేరుతో దాడి చేశారు. గతంలో తన ఇంట్లో జరిగిన బంగారు చోరీ కేసులో తన అసిస్టెంట్ శ్రీనాథ్‌ను కొమురక్క నిలదీయగా, తానే బంగారం దొంగిలించానని శ్రీనాథ్ ఒప్పుకున్నాడు. బంగారం ఎప్పుడు ఇస్తావని రెండు రోజుల క్రితం కూడా కొమురక్క శ్రీనాథ్‌ను మందలించింది. ఈ విషయాన్ని శ్రీనాథ్ తన స్నేహితులకు చెప్పగా, వారు ఫ్యాన్స్ అంటూ, ఫోటో కోసం వచ్చామని కొమురక్కపై దాడి చేశారు.




