TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన 'ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల' కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లను.. ప్రభుత్వం త్వరలోనే పరిశీలించి మంజూరు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.