
దేశవ్యాప్తంగా కులగణన.. కేంద్రం నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కించే ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం శనివారం దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ కులగణన వచ్చే నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం వివరాలు చెప్పాల్సి ఉంటుంది.




