
‘ఇరాన్‌ను వీడండి’.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన
ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో, అక్కడి భారత రాయబార కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. భారత విదేశాంగశాఖ కూడా తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఇరాన్‌కు ప్రయాణించవద్దని సూచించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తంగా మారిన ఇరాన్లో ఇప్పటివరకు 2500 మందికిపైగా మృతి చెందారని నివేదికలు చెబుతున్నాయి.




