సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు

5చూసినవారు
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
TG: సింగరేణి సంస్థ తన కార్మికులకు శుభవార్త తెలిపింది. దీపావళి సందర్భంగా మొత్తం 36 వేల మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ లింక్డ్ రివార్డు(PLR) బోనస్‌ను గురువారం జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 చొప్పున మొత్తం రూ.419 కోట్లను యాజమాన్యం విడుదల చేస్తోంది. ఇప్పటికే సంస్థ లాభాల వాటా కింద సగటున ఒక్కో కార్మికుడికి రూ.1,53,912 చొప్పున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బోనస్ చెల్లింపులు కార్మికుల్లో దీపావళి సంబరాలను మరింత పెంచనున్నాయి.

సంబంధిత పోస్ట్