న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ‘దీపావళి ఎట్ టైమ్స్ స్క్వేర్’ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక నృత్యాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించగా, పర్యాటకులు కూడా ఆసక్తిగా వీక్షించారు. అలాగే, దీపావళి బజార్ ఏర్పాటు చేసి, భారతీయ హస్తకళలు, ఆహార పదార్థాలు, సాంప్రదాయ వస్తువులను ప్రదర్శించారు.