పాకిస్థాన్‌లో హిందూ సమాజం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ, క్రైస్తవ సభ్యులతో పాటు ఇతర మతాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రధాన మంత్రి దీపావళి కేక్ కట్ చేసి, ప్రార్థనలు చేసి, హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.