TG: హైదరాబాద్‌లో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా పేల్చుతూ పలువురు గాయపడ్డారు. మెహెదీపట్నంలోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో 44 మంది బాణసంచా ప్రమాదాల కారణంగా చికిత్స పొందారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. అందరికీ తగిన చికిత్స అందించారు ఎవరికీ శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించడానికి ఆసుపత్రి సిద్ధంగా ఉందన్నారు.