అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల
ఫలితాలు, ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 1,609 పాయింట్లు పెరిగి 78,910కు, నిఫ్టీ 417 పాయింట్లు లాభపడి 24,378కు చేరాయి. నవంబర్‌లో తొలి మూడు సెషన్లలోనే ఎఫ్‌ఐఐలు రూ.17,235 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఐటీ, ఆటో సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.