దీపావళి.. ఇవాళ ఏం చేయాలి?

20074చూసినవారు
దీపావళి.. ఇవాళ ఏం చేయాలి?
TG: హిందువులు అత్యంత వైభవంగా జరుపుకొనే పండగలలో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలి. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉన్నవారు రాత్రి వేళలో జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు కాల్చుకోవచ్చని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్