కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార మార్పుపై స్పష్టత వస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య అధికారిక నివాసంలో కీలక నేతలను బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పు ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ, ఇరువురు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.