సీనియర్
కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ జూన్ 3న కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోకభవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని సమాచారం. మూడేళ్లుగా పదవిలో ఉన్న సిద్ధరామయ్య, అధిష్ఠానం సూచనతో నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.