రిటెయిల్ సంస్థ డీమార్ట్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ.19,206.18 కోట్ల ఆదాయం నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.16,218.79 కోట్లతో పోలిస్తే 18.4 శాతం వృద్ధి సాధించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 4.7 శాతం పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి డీమార్ట్ స్టోర్ల సంఖ్య 581కి చేరింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.