ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

53చూసినవారు
ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. అక్టోబర్ 27న ఈసీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరింది. ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా SIRను అమలు చేయాలనుకుంటున్నారని స్టాలిన్ ఆరోపించారు.
Job Suitcase

Jobs near you