ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Aug 28, 2026, 13:08 IST/

నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్ అప్‌డేట్

Aug 28, 2026, 13:08 IST
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో వందో మైలురాయిగా నిలుస్తున్న ‘కింగ్ 100’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వెలువడింది. యువ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగస్టు 29 ఉదయం 9 గంటలకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఫాస్టెన్ యువర్ సీట్‌బెల్ట్స్… రేపటి నుంచి కింగ్ ఆధిపత్యం మొదలవ్వబోతోంది’ అనే ప్రకటన అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.