
ముగిసిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీబీఐ విచారణ
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీబీఐ విచారణ ముగిసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ అధికారులు విజయ్ను 8 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కాగా గతేడాది సెప్టెంబరు 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది.




