
ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా ఈ మెయిల్ అప్డేట్ చేసుకోండి ఇలా!
UIDAI ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్తను అందించింది. ఇకపై ఆధార్‌లో ఈమెయిల్ ఐడిని మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. వినియోగదారుల సౌకర్యార్థం, UIDAI తన అధికారిక ఆధార్ యాప్ ద్వారానే ఈమెయిల్ అడ్రస్‌ను సులభంగా అప్డేట్ చేసుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వెసులుబాటుతో ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగే పని లేకుండా, ఇంట్లోనే మీ పనిని సులభంగా పూర్తి చేసుకోవచ్చు.




