ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల దంతాలు బలహీనపడి ఎనామిల్ దెబ్బతింటుందని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) పరిశోధనలో తేలింది. బ్రష్ చేసిన తర్వాత దంతాలు సున్నితంగా మారతాయి. వెంటనే టీ తాగడం వల్ల టీలోని టానిన్లు దంతాల ఉపరితలంపై అతుక్కుని వాటిని పసుపు రంగులోకి మారుస్తాయి. దీని వల్ల ఫ్లోరైడ్ పొర కూడా పోతుంది.