భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని 'అనేతోల్' అనే సమ్మేళనం గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను సమర్థంగా తగ్గిస్తుంది. అలాగే, ఇవి నోటి దుర్వాసనను అరికట్టి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఒక టీస్పూన్ సోంపు నమలడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మెటబాలిజం మెరుగుపడుతుంది.