లవ్ ఉన్నా, లవర్ లేకపోయినా ఫీలవ్వాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు. వాలెంటైన్స్ డే రోజును ఒంటరితనంగా ఫీలవ్వకుండా ‘సెల్ఫ్ లవ్ డే’గా మార్చుకోవాలని చెబుతున్నారు. ఇష్టమైన పనులు చేయడం, ఫ్రెండ్స్‌తో పార్టీలు, సినిమాలు, విహారయాత్రలు ప్లాన్ చేసుకోవడం ద్వారా ఆనందంగా గడపవచ్చంటున్నారు. కుటుంబంతో సమయం గడపడం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, కొత్త హాబీలు ట్రై చేయడం కూడా మంచి ఎంపికలేనట. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే నిజమైన సంతోషం లభిస్తుందని, కాబట్టి సింగిల్ స్టేటస్‌ను ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు.