దేశంలో రిచెస్ట్ విలేజ్ గురించి తెలుసా?

92చూసినవారు
దేశంలో రిచెస్ట్ విలేజ్ గురించి తెలుసా?
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ గ్రామం, ఎన్నారైల బ్యాంకింగ్ డిపాజిట్ల ద్వారా దేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా రికార్డు సృష్టించింది. ఈ గ్రామంలోని 1,700 కుటుంబాలు బ్రిటన్‌లో, 800 అమెరికాలో, 300 కెనడాలో, 150 ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాయి. దేశం విడిచి వెళ్లినా, వారు గ్రామాభివృద్ధికి వెన్నెముకగా నిలిచారు. ప్రస్తుతం గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయి. 11 బ్యాంకు శాఖలున్న ఈ గ్రామంలో గ్రామస్తుల అకౌంట్లలోనే రూ. 1,000 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్