తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న గర్భరక్షాంబికా ఆలయం సంతానం లేని వారికి, ఆరోగ్యకరమైన శిశువును కోరుకునే వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుంది. పూర్వం నిధ్రువ మహర్షి భార్య వేదికకు సంతానం లేకపోవడంతో, ఆమెను రక్షించి, శిశువును కాపాడిన అమ్మవారు ఇక్కడ గర్భరక్షాంబికగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి సంతాన ప్రాప్తితో పాటు, మంచి ప్రసవం కూడా జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.